ఆదివారం 17 జనవరి 2021
Wanaparthy - Nov 25, 2020 , 06:36:36

ఘనంగా సాయిబాబా జయంతి

ఘనంగా సాయిబాబా జయంతి

వనపర్తి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని సాయి మందిరంలో సాయిబాబా జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఓంకార సుప్రభాతం, పతాకావిష్కరణ, సత్యసాయి వ్రతం, అమృత కలశాలు, అన్నప్రసాదం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం భజన, డోలోత్సవం, కేక్‌కటింగ్‌, మహా మంగళహారతి నిర్వహించి, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రమేశ్‌రెడ్డి, సాయి భక్తులు ఉన్నారు.