ఆదివారం 24 జనవరి 2021
Wanaparthy - Nov 24, 2020 , 01:10:46

గ్రేటర్‌ ప్రచారంలో నాయకులు

గ్రేటర్‌ ప్రచారంలో నాయకులు

వనపర్తి రూరల్‌/రేవల్లి/గోపాల్‌పేట/చిన్నంబావి/మదనాపురం : హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వనపర్తి టీఆర్‌ఎస్‌ మండల నాయకులు అంబర్‌పేట్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. మాజీ మండలాధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో పలువురు నా యకులు ఇంటింటి ప్రచారం చేశారు. అంబర్‌పేట కార్పొరేట్‌ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. రేవల్లి మండలం నుంచి జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ సేనాపతి ఆధ్వర్యంలో జో రుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 1న జరుగను న్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలల్లో భాగంగా సోమవారం గోపాల్‌పేట మండల టీఆర్‌ఎస్‌ నాయకులు తరలివెళ్లి ప్రచారం చేశారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో సోమవారం ముషీరాబాద్‌ 25వ డివిజన్‌కు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తీగల సునరితారెడ్డి అభ్యర్థికి మద్దతుగా కొత్తకోట జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌ డ్‌, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌నారాయణలు ప్రచారం చేశారు. బాగ్‌అంబర్‌పేట్‌ 84వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీపీ పద్మావతిరెడ్డి తరఫున గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్నంబావి ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ కేసిరెడ్డివెంకట్రామమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఈదన్నయాదవ్‌ పాల్గొన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచన మేరకు ముసారాంబాగ్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునరితారెడ్డికి మద్దతుగా మదనాపురం మండల నాయకులతో కలిసి సీడీసీ డైరెక్టర్‌ ఆవుల బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రవికుమార్‌, నరేందర్‌రెడ్డి, సర్పంచులు సునీల్‌కుమార్‌, రమేశ్‌యాదవ్‌, గోపాల్‌రావు, ఎంపీటీసీ శ్రీశైలంయాదవ్‌, నాయకులు సురెందర్‌రెడ్డి, సయ్యద్‌జహంగీర్‌, రవి, నాగులయ్య, లక్ష్మణ్‌, గోపాల్‌పేట వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, బాల్‌రాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్‌, కోటీశ్వర్‌రెడ్డి, జాంప్లానాయక్‌, రవి, మతీన్‌, మణ్యం యాదవ్‌, శేఖర్‌, యాది, జయపాల్‌నాయక్‌, జగన్‌నాయక్‌, ఆకుల శ్రీను, శ్రీనూజీ, రాములుయాదవ్‌, చిన్నారెడ్డి, సత్యంయాదవ్‌, శ్రీనివాసులు, మనోజ్‌ కుమార్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

గ్రేటర్‌లో రెపరెపలాడనున్న టీఆర్‌ఎస్‌ జెండా

వనపర్తి : డిసెంబర్‌ 1వ తేదీన జరుగబోయే గ్రేటర్‌ ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని టీఆర్‌ఎస్‌ నా యకుడు తిరుమల మహేశ్‌ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, అంబర్‌పేట ఇన్‌చార్జి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వనపర్తి నాయకులతో కలిసి హైదరాబాద్‌లోని 83వ డివిజన్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌కుమార్‌గౌడ్‌ తరఫున ఆయన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మహేశ్‌, మార్కె ట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, మాణి క్యం, గోపాల్‌యాదవ్‌, యాదగిరి, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo