ఆదివారం 24 జనవరి 2021
Wanaparthy - Nov 24, 2020 , 01:10:43

వృత్తి విద్యను అభివృద్ధిపరచాలి

వృత్తి విద్యను అభివృద్ధిపరచాలి

వనపర్తి విద్యావిభాగం : మహాత్మాగాంధీ సూచించిన ప్రాతిపదిక విద్యలో భాగంగా వృత్తి విద్యను అభివృద్ధి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్‌ పద్మజ అన్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలిమెంటరీ వృత్తి విద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు నాయితాలింలో భాగంగా అనుభవంతో కూడిన విద్యను గ్రామీణస్థాయి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా విద్య విధానం రూపొందించబడిందన్నారు. ఆ విద్యావిధానాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రూపంలో బోధించినప్పుడు మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అధునాతన బోధనతో విద్యను ఏ విధంగా అందించాలో మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎస్సీఆర్‌టీ సభ్యురాలు శిరీష, కళాశాలల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, అధ్యాపకులు నిరంజన్‌వలీ ఉన్నారు. 


logo