సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి

- అంబులెన్స్ ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి అర్బన్ : సేవా కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకున్నప్పుడే సేవా దృక్పథం పెరిగి మంచి వాతావరణం నెలకొంటుందని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా తెలిపారు. సోమవారం జిల్లా దవాఖానలో నూతన అంబులెన్స్‌ను జెడ్పీ చైర్మన్, కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 13 అంబులెన్స్‌ను అత్యవసర సేవలకు వినియోగించేందుకు అందజేయగా వాటిలో ఒకటి వనపర్తి జిల్లాకు మంజూరు చేశారన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకోవాలని కోరారు. కొవిడ్-19 రెండో విడుత వైరస్ విజృంభిస్తుందని ప్రభుత్వం ప్రకటించిందని, అందుకు నివారణ చర్యలే ముఖ్యమన్నారు. భౌతిక దూరం పాటించడంతో మాస్కులు ధరించాలని, చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 2003 పాజిటివ్లను గుర్తించినట్లు వారీలో 95 శాతం మంది రికవరీ అయ్యారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్‌సాగర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ బ్రహ్మం పాల్గొన్నారు.
బాలల హక్కులను కాపాడుదాం
గోపాల్పేట : బాలల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ కింద రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం 11వ నేషనల్ ఎడ్యూకేషన్ డే 14వ చిల్డ్రన్స్‌డే సందర్భంగా గోపాల్పేట అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 0-18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరిని కూడా చదువుకునేలా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి సేవలు వంద శాతం వినియోగించుకోవాలన్నారు. అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి జెడ్పీ చైర్మన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ చైర్మన్ చిన్నమ్మ థామస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- బిలియనీర్ జాక్‌మా కనిపించారు..