మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Nov 23, 2020 , 02:10:35

రంగనాయక స్వామి ఆలయంలో సీరియల్‌ షూటింగ్‌

రంగనాయక స్వామి ఆలయంలో  సీరియల్‌ షూటింగ్‌

శ్రీరంగాపూర్‌: మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో వంశోద్ధార సీరియల్‌ షూటింగ్‌ అట్టహాసంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్‌ కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ జెమిని చానల్లో చందన స్టూడియో బ్యానర్‌పై త్వరలో ప్రారంభమయ్యే వంశోద్ధార సీరియల్‌లో ప్రశాంత్‌, పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిపారు. ఆలయంలో జాతర సెట్టింగ్‌, మహిళల కోలాటాలతో ఆలయ ప్రాంతం కోలాహలంగా కనిపించింది. షూటింగ్‌ చూడటానికి ప్రజలు తరలివచ్చారు.