శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Nov 22, 2020 , 01:24:37

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు

  •  ఎంపీపీ కిచ్చారెడ్డి

వనపర్తి రూరల్‌ : హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీర్‌ఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల  ప్రచారానికి ఎంపీపీ ఆధ్వర్యంలో మండల టీఆర్‌ఎస్‌ నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలోని అంబర్‌పేట్‌ ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ జెండాను తప్పక ఎగురవేస్తామన్నారు. ప్రచారానికి వెళ్లిన వారిలో చిట్యాల సర్పంచ్‌ భానుప్రకాష్‌రావు, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ ఉస్మన్‌, ఎంపీటీసీ ధర్మనాయక్‌, విష్ణుయాదవ్‌, మాధవ్‌రెడ్డి, బాలకృష్ణ, శ్రీనివాసులు, అశోక్‌కుమార్‌, భగవంతు, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో పెబ్బేరు, రేవల్లి నాయకులు

పెబ్బేరు/రేవల్లి : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం అబర్‌పేట్‌లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయ్‌గౌడ్‌ గెలుపు కోసం పెబ్బేరు, రేవల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిను ఓటర్లకు వివరించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, శ్రీరంగాపూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ జగనాథంనాయుడు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నవీన్‌రెడ్డి, రేవల్లి ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, వైస్‌ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, సర్పంచులు సునీల్‌కుమార్‌, రమేశ్‌ యాదవ్‌, సయ్యద్‌జహంగీర్‌, రవి, సాయినాథ్‌, రాము పాల్గొన్నారు.