మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 22, 2020 , 01:24:36

చట్టాలపై అవగాహన పెంచాలి

చట్టాలపై అవగాహన పెంచాలి

  •  లైగింక నేరాల నివారణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి 
  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి : అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు చట్టాలపై కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకం, సఖి సెంటర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బాలలపై లైంగిక నేరాల నిషేధ చట్టం 2012 పైన ఫోకో చట్టంపై 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు అవగాహన కల్పించారు. మహిళలకు సంబంధించి ప్రివెన్షన్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హారాస్‌మెంట్‌ ఎట్‌ వర్క్‌ ప్లేస్‌, 2013 యాక్ట్‌పై, మాటరినిటి బెనిఫిట్‌ యాక్ట్‌ 1961, ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ద ఈక్వల్‌ రెమ్యూనేషన్‌ యాక్ట్‌ 1976, విమెన్‌ అండ్‌ దరె ప్రొడ్యూక్టివ్‌ హెల్త్‌ రైట్స్‌, ద మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ యాక్ట్‌ 1971 వంటి వాటిపై పూర్తి స్థాయిలో వివరించారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలపై లైంగిక నేరాలు చాలా పెరిగిపోతున్నాయన్నారు. వీటిని అరికట్టాలంటే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయాల మీద విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలలో నేరుగా పనిచేసే ప్రభుత్వ శాఖలు బాలల సమస్యలు, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఫోకో చట్టం గురించి మాట్లాడే విధంగా చూస్తామన్నారు. మహిళలు, బాలికలు ఉన్నత చదువులు చదివి అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే ఆది పరాశక్తులు అవుతారని కలెక్టర్‌ వివరించారు.

అనంతరం అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ బాలికలు, మహిళల పైన అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో అన్ని ప్రభుత్వ యంత్రాగాలు సమష్ఠిగా కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌  సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ వెంకట్‌రామ్‌, న్యాయవాదులు పుష్పలత, విజయలక్ష్మి, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ చిన్నమ్మథామస్‌, శ్రామిక వికాస సంస్థ డైరెక్టర్‌ లక్ష్మణ్‌రావు, బాలరక్షభవన్‌ కోఆర్డినేటర్‌ కృష్ణచైతన్య, బాలలసంరక్షణ జిల్లా అధికారి రాంబాబు, సీడీపీవో పుష్పవతి, సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ గిరిజాప్రీతి, సఖి కేంద్ర ఉద్యోగులు, సీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.