శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Nov 20, 2020 , 02:49:09

బీపీతో అప్రమత్తంగా ఉండాలి

బీపీతో అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి    అర్బన్‌ : బీపీపై అశ్రద్ధ చేయొద్దని, బీపీతో అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియో వాక్స్య్‌లర్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వసీఅబ్దుల్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు. గురువారం జిల్లా డీఎంహెచ్‌వో సమావేశపు మందిరంలో జిల్లాలోని గాంధీనగర్‌, పీర్లగుట్ల అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, కడుకుంట్ల, అప్పరాల పీహెచ్‌సీల పరిధిలోని వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలకు ఐహెచ్‌సీఐ(ఇండియా హైపర్‌టెన్షన్‌ కంట్రో ల్‌ ఇనిషియేటివ్‌)పై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

గ్రామాల్లో 30 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ చెక్‌ చేయాలని తెలిపారు. జీవనశైలీలో మార్పు విధిగా పాటించాలని, మద్యపానంతోపాటు దూమపానం మానుకోవాలని, ఉప్పు వాడకాన్ని తగ్గించాలన్నారు. పండ్లు, కూరగాయల వాడకం పెంచాలని, క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం, జాగింగ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు సాయిరెడ్డి, రమేశ్‌, మద్దిలేటి, వైద్యాధికారులు రాకేశ్‌రెడ్డి, బరద్వాజ్‌ పాల్గొన్నారు.