బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Nov 19, 2020 , 05:26:23

కల్లాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

కల్లాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ఖిల్లాఘణపురం : మండల కేంద్రంతోపాటు మండలంలోని రైతులు త మ పొలాల్లో సిమెంట్‌ కల్లాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి రఘురాం బుధవారం తెలిపారు. కల్లాలను నిర్మించుకునేందుకు రైతుకు ఐదు ఎకరాల భూమి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, ఇతరులకు 90 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కావున అర్హులై న రైతులు వ్యవసాయ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.