శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 18, 2020 , 01:33:43

జీతాలు పెంచాలని కార్మికుల నిరసన

జీతాలు పెంచాలని కార్మికుల నిరసన

వనపర్తి/పెబ్బేరు/కొత్తకోట : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పెంచినట్లు వనపర్తి మున్సిపల్‌ కార్మికులకు రూ.3వేలు అదనంగా జీతం పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు కోరారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ము న్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. పెబ్బేరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ నేతృత్వంలో మున్సిపల్‌ కార్మికులకు రూ.3వేల జీతాలు పెంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌కృపాకర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మున్సిపల్‌ కార్మికులకు పెంచిన వేతనాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చే స్తూ మంగళవారం కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీపాదుకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు యాదగిరి, కురుమయ్య, మణ్యం, బాలు, వెంకటమ్మ, రాణి, పద్మ, రాజు, రాములు, రంజీత్‌కుమార్‌, ఈశ్వర్‌, సునీత, కరుణాకర్‌, విజయ్‌ పాల్గొన్నారు.