శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Nov 18, 2020 , 01:33:42

చిన్నారులందరికీ వ్యాక్సిన్‌ వేయించాలి

చిన్నారులందరికీ వ్యాక్సిన్‌ వేయించాలి

వనపర్తిఅర్బన్‌ : కరోనాతోపాటు ఇతర వ్యాధులు ప్రబలకుండా చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్‌ నాగన్న కోరారు. మంగళవారం పట్టణంలోని 32వ వార్డులో పలువురి చిన్నారులకు వ్యాక్సిన్‌ టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది తిరుపతమ్మ, కవిత, మాధవి, కాలనీవాసులు నవీన్‌యాదవ్‌, రవీందర్‌ పాల్గొన్నారు.