బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 14, 2020 , 02:11:41

ఘనంగా కాళోజీ వర్ధంతి

ఘనంగా కాళోజీ వర్ధంతి

వనపర్తి విద్యావిభాగం/ఖిల్లాఘణపురం : తెలంగాణ తొలిపొద్దు, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతిని శుక్రవారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో సామాజిక కార్యకర్త కమ్మర్‌గోపి ఆధ్వర్యంలో కవి కాళోజి నారాయణరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కవి గాయకులు రాజారాంప్రకాశ్‌, పండితులు గిరిరాజయ్యచారి, నరసింహశర్మ, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, వెంకటేశ్‌, వెంకయ్య, ప్రజాసంఘాలు, కళాకారులు వెంకటస్వామి, నాగేంద్రం, ఈశ్వర్‌, నాగరాజు, నాగన్న, నాగార్జున, భాస్కర్‌, బాలరాజు, కురుమూర్తి, ఆంజనేయులు, శివశంకర్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.