శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Nov 14, 2020 , 02:11:43

గుడాంబ కేసు విముక్తులకు చెక్కుల పంపిణీ

గుడాంబ కేసు విముక్తులకు చెక్కుల పంపిణీ

వనపర్తి రూరల్‌ : మండల పరిషత్‌ కార్యాలయం లో పలు గ్రామాలకు చెందిన గుడాంబ కేసులు నమోదై 12మందికి జీవనోపాధి కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు చెక్కులను మం జూరు చేసింది. ఆ చెక్కులను శుక్రవారం ఎంపీపీ కిచ్చారెడ్డి, ఎంపీడీవో రఫీక్‌ఉన్నీస్‌ వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో గుడాంబ, సారా తయారీ, విక్రయాల్లో కేసు నమోదైన వారికి వాటి నుంచి విముక్తి కలిగించేలా ఇతర వ్యాపారల నడుపుకోనేందుకు ఆర్థిక సహాయం అందించిందన్నారు. దానిలో భాగంగానే రెండో విడుతలో భాగంగా 12 మందికి మరింత ఆర్థిక సహాయం కింద చెక్కులను అందించామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కొండన్న, రవీంద్రబాబు, రామకృష్ణ, ఎంపీటీసీ ధర్మనాయక్‌ పాల్గొన్నారు.