సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Nov 13, 2020 , 06:21:07

పనిభారం తగ్గించాలి

పనిభారం తగ్గించాలి

వనపర్తి రూరల్‌/మదనాపురం/వీపనగండ్ల : అదనపు పనిభారం తగ్గించాలని కోరుతూ గురువారం వనపర్తి, మదనాపురం, వీపనగండ్లకు చెందిన పంచాయతీ కార్యదర్శులు ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయాల అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ కార్యదర్శులకు పనిఒత్తిడి తట్టుకోలేని పరిస్థితిగా మారిందని గురువారం వనపర్తి మండల పంచాయతీ అధికారి రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెప్రగతి యాప్‌తోపాటు ఎస్‌బీఎం యాప్‌, టీఎస్‌ఎన్‌బీ యాప్‌లతో పని భారం పెరుగుతుందని వినతి పత్రం ద్వారా అధికారులకు విన్నవించారు. అలాగే మదనాపురంలో పంచాయతీ, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిభారం తగ్గించాలని గురువారం ఎంపీడీవో నాగేంద్రానికి వినతిపత్రం అందజేశారు. వీపనగండ్లలో పంచాయతీ కార్యదర్శులపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో కతలప్పకు గురువారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో విక్రమ్‌గౌడ్‌, మహేందర్‌, రాజేశ్‌, రవి, శిరీష, సాయికుమార్‌, భానుప్రకాశ్‌, కురుమయ్య, మధుసూధన్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.