బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 12, 2020 , 02:45:39

రైతు మేలు కోరే ప్రభుత్వం

రైతు మేలు కోరే ప్రభుత్వం

వనపర్తి రూరల్‌ :  సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల మేలు కోరుకుంటున్నదని, రైతులు పండించిన ధాన్యాన్ని స్థానికంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌  అన్నారు. బుధవారం పట్టణంలోని నర్సింగాయిపల్లి వార్డులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం మద్దతు ధరతో సన్నరకం ధాన్యం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అందుకు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. అలాగే రైతులు వడ్లు ఆరబెట్టుకొని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్‌ పరుశురాముడు, కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

రైతులకు అన్యాయం చేయొద్దు

వనపర్తి అర్బన్‌: మార్కెట్‌ యార్డులో తుకాల్లో మోసం చేసి రైతులకు అన్యాయం చేయొద్దని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ చేట, దడువాయి కార్మికులు ధాన్యంపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తు తీరని నష్టం కలిగిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు స్పందించిన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల వల్ల మార్కెట్‌కు ధాన్యం చాలా తక్కువగా వస్తుందని, చేట, దడువాయి కార్మికులు రైతులకు నష్టం కలిగిస్తే మార్కెట్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అందుకు రైతులపై గౌరవంగా ఉండి వారికి లాభం కలిగిలా వ్యవహరించాలని తెలిపారు. వారివెంట డైరెక్టర్‌ యుగంధర్‌రెడ్డి , మార్కెట్‌ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.