శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Nov 10, 2020 , 02:55:14

చురుకుగా ధరణి సేవలు

చురుకుగా ధరణి సేవలు

మానవపాడు : గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో రమణారావు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం మండల ంలోని చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడు, చెన్నిపాడు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచులు ఉన్నారు.

ఇటిక్యాల : మండలంలో ధరణి సేవలు చురుకుగా కొనసాగుతున్నాయి. సోమవారం ఆరుగురు స్లాట్‌ బుక్‌చేసుకున్నట్లు తాసిల్దార్‌ శివలింగం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఐదుగురు, అలాగే పెద్దదిన్నె గ్రామం నుంచి ఒకరు మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని వారందరి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి యాజమాన్య హక్కులను కల్పించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు సుదర్శన్‌రెడ్డి, అజిత్‌కుమార్‌,కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

జోరందుకున్న ధరణి రిజిస్ర్టేషన్ల్లు

రాజోళి : రిజిస్ర్టేషన్లు మండలంలో జోరందుకున్నాయి. సోమవారం ఒక్కరోజే రాజోళి తాసిల్దార్‌ కార్యాలయంలో నాలుగు రిజిస్ర్టేషన్లు జరిగినట్లు తాసిల్దార్‌ తెలిపారు.  

మల్దకల్‌లో 4 రిజిస్ట్రేషన్లు 

మల్దకల్‌ : మండలంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం 4 భూ సంబంధిత రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేసినట్లు తాసిల్దార్‌ ఆజం అలీ పేర్కొన్నారు. అనంతరం రైతులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేశారు.

రిజిస్ట్రేషన్లను పరిశీలించిన ప్రత్యేక అధికారి

మానవపాడు : ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రత్యేక అధికారికి పరిశీలించారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రత్యేక అధికారి  రమేశ్‌బాబు పరిశీలించారు. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

  • ప్రకృతి వనాలు వేగవంతం చేయాలి
  • బాలికా విద్య ప్రాముఖ్యతపై అవగాహన

మల్దకల్‌ : బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్సై శేఖర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కళాజాత బృందం ఆధ్వర్యంలో బాలికా విద్య ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ యాకోబ్‌, సంస్థ సభ్యులు ప్రకాశ్‌ ఉన్నారు.

టీజీపీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహేశ్‌

అలంపూర్‌ : గురుకులాల విద్యార్థుల విద్యా భవిష్యత్‌ కోసం నిరంతరం కృషి చేస్తున్న అలంపూర్‌ వాసి మహేశ్‌ను టీజీపీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్త్తూ సుప్రీమ్‌ స్వేరో, అడిషనల్‌ డీజీపీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ కొమరం భీం హాల్‌లో స్వేరోస్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ కందికంటి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు.