బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 10, 2020 , 01:10:04

మైనార్టీ గురుకుల కళాశాలలో ఏర్పాట్లు పూర్తి

మైనార్టీ గురుకుల కళాశాలలో ఏర్పాట్లు పూర్తి

  • మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలి  
  • జిల్లాస్థాయి సమన్వయకర్త గులాంహుస్సేన్‌

కొత్తకోట రూరల్‌ : మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న మానస వృత్తివిద్య కళాశాలలో నూతనంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాస్థాయి సమన్వయకర్త గులాంహుస్సేన్‌ అన్నారు. సోమవారం ఆయన కళాశాల సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరానికి ఎంఈసీలో 36, సీఈసీలో 19 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కళాశాలలోని రెండు కోర్సులలో మిగిలిన 55 సీట్లకు ఈనెల 16 చివరి అవకాశం అన్నారు. మండలంలో నూతన మైనార్టీ కళాశాల ఏర్పాటుకు సహకరించిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.