గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Nov 10, 2020 , 00:36:28

ఐక్యతతోనే హక్కులు సాధించుకుందాం

ఐక్యతతోనే హక్కులు సాధించుకుందాం

పెబ్బేరు : ఐకమత్యంతో ముదిరాజుల ఆత్మగౌరవం చాటిచెప్పుతూ, హక్కులను సాధించుకుందామని వనపర్తి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలో ముదిరాజుల జీవన శైలి విధానంపై చిత్రించిన లఘు చిత్రాన్ని సోమవారం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ లక్ష్మయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్‌ కుల పూర్వ వైభవం, జీవన విధానం అద్భుతమైనదని చరిత్రను శోధిస్తే తెలుస్తుందన్నారు. మహోన్నతమైన చరిత్ర కలిగిన ముదిరాజుల కులం నేటి సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, విద్యాభివృద్ధిలేక ఆమడదూరంలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముదిరాజ్‌ల జీవన విధానం, వారు చేసే పని విధానం గురించి సంపూర్ణంగా తెలియజేసే ధారవాహిక ద్వారా చైతన్యం కావాలని కోరారు. ముదిరాజులను బీసీ డీ గ్రూప్‌ నుంచి బీసీ ఏ గ్రూప్‌లో చేర్చాలని కోరారు. ముదిరాజుల జీవన విధానంపై తీసిన లఘు చిత్రరూపకర్త గొడుగు స్వామిని అభినందించారు. కార్యక్రమంలో మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు బాలస్వామి, శ్యాం, బాలరాజు, భరత్‌కుమార్‌, శ్రీనివాస్‌, మహేశ్‌, బాలవర్ధన్‌, నరసింహ పాల్గొన్నారు.