శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Nov 09, 2020 , 00:53:31

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ

పెబ్బేరు :  రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమమే పరమావధిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీ ఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ముస్తాక్‌ నేతృత్వంలో చేపట్టిన లబ్ధిదారులతో చిట్‌చాట్‌ కార్యక్రమానికి ప్రజాప్రతినిధు లు, నాయకులు హాజరయ్యారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్‌ అందుతున్న తీరు, వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నామని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గౌని బుచ్చారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఆ టంకాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్‌ పింఛన్‌ లబ్ధిదారులకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పెంచిన ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు అందజేస్తూ ఇంటికి పెద్దకొడుకుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, కౌన్సిలర్లు ఎల్లారెడ్డి, పట్టణాధ్యక్షుడు హరిశంకర్‌ నాయుడు, నాయకులు సాయినాథ్‌, ఎల్లయ్య,  ఈశ్వర్‌, రాజశేఖర్‌, బీచుపల్లి, లబ్ధిదారులు పాల్గొన్నారు.