ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Nov 09, 2020 , 00:38:36

అన్ని వర్గాల ప్రజలకు సర్కార్‌ అండ

అన్ని వర్గాల ప్రజలకు సర్కార్‌ అండ

గోపాల్‌పేట : అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాల్‌రాజు అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలుతీరుపై ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ వచ్చాక అన్ని రకాల పింఛన్లను పెంచి ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్న ట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంజీకేఎల్‌ఐ నీటిని అందించి సస్యశ్యామలం చేశారన్నారు. అన్నం పెట్టే రైతు అప్పుల పాలు కాకుం డా ఉండేందుకు పంట సాగుకు పెట్టుబడి అంది స్తూ, పండించిన పంటను మద్దతు ధరకు కొంటూ రైతులను కేసీఆర్‌ సర్కార్‌ ఆదుకుంటుందన్నారు. రైతులకు తాగు, సాగు నీటిని అందించేందుకు అ హర్నిషలు శ్రమిస్తున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కా ర్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాసులు, నాయకులు కోటీశ్వర్‌రెడ్డి, కోదండం, శ్రీనివాస్‌రావు, మణ్యెంనాయ క్‌, మునీంద్ర, రాజు, మతీన్‌, గోపాల్‌, వెం కటస్వామి, కాశీనాథ్‌, శివ, రాజు పాల్గొన్నారు.

అభివృద్ధి పథకాలపై కరపత్రాల పంపిణీ

వనపర్తి టౌన్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలపై రూపొందించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని 9వ వార్డులోని బువనమ్మతండా, ముందరితండాలలో ఆదివారం కౌ న్సిలర్‌ బాషనాయక్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయం లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కూడా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పథకాలను నిలిపివేయలేదని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రభు త్వం వృద్ధులకు పెంచిన పింఛన్‌ విజయవంతంగా ఏడాది పూర్తయ్యిందన్నారు. ప్రభుత్వ పథకాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశామన్నా రు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కరపత్రాలపై ముద్రించి ఆదివారం జెడ్పీటీసీ సామ్యనాయక్‌, సర్పంచ్‌ వెంకటరమ ణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్య ప్రజల కు పంపిణీ చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పెంచిన పింఛన్లు ఏడాది పూర్తి కావడంతో వృద్ధులను పలకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకొని అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. అన్నివర్గాల ప్రజ లు ఆర్థికంగా ఎదిగేందుకు ఆయా వృత్తుల వారికి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్‌, కృష్ణయ్యగౌడ్‌, గిరి, బాల్‌రెడ్డి ఉన్నారు.

శ్రీరంగాపూర్‌లో..

శ్రీరంగాపూర్‌ : మండలంలోని జానంపేట గ్రామంలో ఆదివారం ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలు తీరుపై సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కర పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలనుసా రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల కర పత్రాలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమ ంలో ఉపసర్పంచ్‌ శివ, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు ఖయ్యూం, కార్యకర్తలు పాల్గొన్నారు.