సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Nov 08, 2020 , 02:48:49

సీడీసీ చైర్మన్‌గా బీసం చెన్నకేశవరెడ్డి

సీడీసీ చైర్మన్‌గా బీసం చెన్నకేశవరెడ్డి

నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

కొత్తకోట : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొత్తకోట పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్‌ చెన్నకేశవరెడ్డిని శనివారం సీడీసీ చైర్మన్‌గా నియామిస్తూ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. అడ్డాకులలోని ఈ నియామక పత్రాన్ని ఎమ్మెల్యే ఆయనకు అందజేశారు. అనంతరం సీడీసీ చైర్మన్‌గా చెన్నకేశవరెడ్డిని నియమించినందుకు జడ్పీ వైస్‌ చైర్మన్‌ రామన్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌నారాయణ, మున్సిపాల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు విశ్వేశ్వర్‌, శ్రీను, నరేందర్‌నాయుడు, రాములుయాదవ్‌, కటిక శ్రీను పాల్గొన్నారు.