శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Nov 08, 2020 , 02:17:55

సులువుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

సులువుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

కొత్తకోట రూరల్‌ : మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌, సబ్‌ రిజిస్ట్రర్‌ సేవలు శనివారం కొనసాగినట్లు తాసిల్దార్‌ రమేశ్‌రె డ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరణి సేవలు, రిజిస్ట్రర్‌ సేవలు మండల కేంద్రంలోనే అందించేందుకు ప్రారంభించామని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రైతుల రిజిస్ట్రేషన్‌ సేవలు తాసిల్దార్‌ కార్యాలయంలోనే అందనున్నట్లు తెలిపారు. కనిమెట్ట గ్రామానికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయిందని, నూతన ధ్రువపత్రాలను కొనుగోలుదారులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కనిమెట్ట గ్రామస్తులు పాల్గొన్నారు.

చిన్నంబావిలో..

చిన్నంబావి : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేష న్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ సులభంగా అవుతోందని చిన్నంబా వి తాసిల్దార్‌ శాంతిలాల్‌ అన్నారు. శనివారం చిన్నంబావి జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నాలుగు రిజిస్ట్రేష న్లు పూర్తిచేసి పత్రాలను కొన్నవారికి అందజేసినట్లు తెలిపారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : ధరణి సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్‌ నరేందర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి ద్వారా రెం డు రిజిస్ట్రేషన్లు అయినట్లు ఎమ్మార్వో తెలిపారు. పొల్కెపహా డ్‌ గ్రామానికి చెందిన మిట్టకడుపుల బాలయ్య తన కొడుకు మిట్టకడుపుల రాములు పేరుమీద 1.20 ఎకరాలు దానపూర్వకంగా రిజిస్ట్రేషన్‌ చేయించగా, గోపాల్‌పేట మండల కేం ద్రానికి చెందిన గుఫణీ లక్ష్మి ఇతరుల నుంచి 0.21 గుంటలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. వీరికి రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 400 సాదాబైనామాలు వచ్చినట్లు చెప్పారు. 

వనపర్తిలో..

వనపర్తి రూరల్‌ : ధరణి పోర్టల్‌ రాకతో వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్‌ సులువు కావడం ప్రజలు తమ వారి పేర్ల మీద భూమి బదలయింపు చేస్తుకుంటున్నారని తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ అన్నారు. శనివారం మండల రెవెన్యూ కార్యాలయ ంలోని సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో వ్యవసాయ భూములను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం మం డలంలో నుంచి మొత్తం పది రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. అందులో నాచహళ్లీ 4, చీమనగుంటపల్లి 4, చిట్యాల 1, రాజపేట 1 ఉన్నాయన్నారు. కేవలం 15 నిమిషాలలోనే సేల్‌ డీడ్‌ కం. మ్యూటేషన్లు అవుతున్నాయని చెప్పారు.

వీపనగండ్లలో..

వీపనగండ్ల : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పో ర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ ఎంతో సులువుగా ఉంటుందని తాసిల్దార్‌ యేషయ్య అన్నారు. శనివారం నాటికి మండలంలో మొత్తం ఎనిమిది రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలు అవగాహన కలిగియుండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాజేశ్వరి పాల్గొన్నారు.

శ్రీరంగాపురంలో..

శ్రీరంగాపురం : మండలంలో ధరణి పోర్టల్‌ ద్వారా భూము ల రిజిస్ట్రేషన్లు సులభంగా వేగంగా అందుతుండంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి తాసిల్దార్‌ శివకుమార్‌ మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల ద్వారా శనివారం ఇద్దరు రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ సేవలను సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.