శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Nov 06, 2020 , 04:00:17

‘ధరణి’తో రైతులకు మేలు

‘ధరణి’తో రైతులకు మేలు

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి రూరల్‌ : ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూముల రైతులకు ఎంతోగానూ మేలు జరుగుతుందని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ పాత వ్యవస్థతో పోలిస్తే ధరణి పోర్టల్‌ వ్యవస్థ ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. జిల్లాలోని రైతులు, ఇతరులు వ్యవసాయ భూముల కొనుగోలు వ్యవహారాలు మొత్తం ప్రతి మండల తాసిల్దార్‌ కార్యాలయంలోనే నిర్వహణ జరుగుతుందన్నారు. తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చే ముందు తమ వివరాలను మీసేవ కేంద్రం వద్దకు వెళ్లి అమ్మకం, కొనుగోలుదారుల వివరాలను నమోదు చే సి, దానికి సంబంధించిన రుసుం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలన్నారు. స్లాట్‌ బుక్‌ ద్వారా తమ వీలును బట్టి రిజిస్ట్రేషన్‌ తేదీని నిర్ణయించుకొని రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చునని తెలిపారు. కేవలం 20 నిమిషాలను రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. అలాగే  భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పత్రాలను లబ్ధిదారులకు కలెక్టర్‌ అందజేశారు. అం తకుముందుకు అదనపు కలెక్టర్‌, తాసిల్దార్‌ కార్యాలయంలోని ధరణి పోర్టల్‌ విభాగాన్ని పరిశీలించారు.

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ : రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం ధరణి పోర్టర్‌ ప్రారంభించిందని ఇక రిజిస్ట్రేషన్లు సులభతరం కానున్నాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నా రు. గురువారం కలెక్టర్‌ మండలకేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పోర్టర్‌ అమలుతీరు తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం రాష్ర్టానికే కాదు దేశానికే ఆదర్శమన్నారు. జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఇప్పటివరకు లబ్ధిదారులు 35 స్లాట్‌బుకింగ్‌ చేసుకున్నారు. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, వారస త్వం, వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు అరగంటలో పూర్తి కావడమేకాకుండా పాసుపుస్తకం చేతికి వస్తుందని తెలిపారు. అనంతరం పల్లెప్రకృతి వనానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రభు త్వ భూముల పరిరక్షణకుగానూ రెవెన్యూ అధికారులు చ ర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో విశ్వేశ్వర్‌రెడ్డి, తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఏపీడీ రమేశ్‌, డీటీ చక్రపాణి, సర్పంచ్‌ రమేశ్‌, ఏపీవో కు రుమయ్య, ఎంపీవో రామస్వామిలు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్‌ పరిశీలన

పెద్దమందడి : మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ కేంద్రాన్ని గురువా రం అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. ధరణి వెబ్‌సైట్‌ ఏ విధంగా పనిచేస్తుందని తాసిల్దార్‌ సునీతను అడిగి తెలుసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి పంపించాలని సూచించారు. రైతులకు ధరణి పోర్టల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.