గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Nov 06, 2020 , 04:00:24

మదనాపురంలో మొదటి రిజిస్ట్రేషన్‌

మదనాపురంలో మొదటి రిజిస్ట్రేషన్‌

  • అరగంటలో ప్రక్రియ పూర్తి
  • రైతుకు ఎమ్మెల్యే ఆల శుభాకాంక్షలు

మదనాపురం : మండలంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం ధరణి ద్వారా మొదటి రిజిస్ట్రేషన్‌ చేశారు. దుప్పల్లి గ్రామానికి చెందిన బోయ తిరుపతమ్మకు చెందిన 1.34 ఎకరాలను అదే గ్రామానికి చెందిన అల్లీపురం ఆంజనేయులు కొనుగోలు చేశాడు. తాసిల్దార్‌ సంధ్య కేవలం అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇంత త్వరగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతో లబ్ధిదారుడు ఆనందం వ్యక్తం చేశాడు. మండలంలో మొట్టమొదటి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆంజనేయులుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ధరణిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని నాయకులకు సూచించారు. అనంతరం ఆంజనేయులు, తాసిల్దార్‌ సంధ్యను రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ హనుమాన్‌రావు శాలువాతో సన్మానించారు.