సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Nov 05, 2020 , 05:41:20

ఇసుక అక్రమ తరలింపుపై దృష్టిపెట్టాలి

ఇసుక అక్రమ తరలింపుపై దృష్టిపెట్టాలి

వనపర్తి టౌన్‌: జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు వాగు, జెర్రీపోతుల వాగులో ఇసుకను రెండు రోజులుగా జేసీబీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని బీజేపీ ఓబీసీ మోర్చా న్యాయవాది మున్నూరు రవీందర్‌ బుధవారం ప్రకటనలో అధికారులను కోరారు. అక్రమంగా ఇసుక రవాణా చేయడంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం నష్టపోతుందని సంబంధిత మైనింగ్‌, రెవెన్యు, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక దోపిడీదారులపై చర్యలు తీసుకుంటూ ఇసుక ధర మొత్తం మార్కెట్‌ రేటు ప్రకారం వసూలు చేయాలని కోరారు.