మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 03, 2020 , 03:50:50

వనపర్తికి వ్యవసాయ సంచాలకుల కార్యాలయం

వనపర్తికి వ్యవసాయ సంచాలకుల కార్యాలయం

వనపర్తి : వనపర్తి జిల్లాకు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం రావడం శుభసూచకమని మున్సిపల్‌  చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యాలయానికి రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన నుంచి నిధులు మంజూరయ్యాయని, రూ.40లక్షలతో త్వరలో భవన నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యాలయం వల్ల శిక్షణ కార్యక్రమాలు, విత్తనాల నిల్వ తదితర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందని, కార్యాలయం రావడానికి కృషి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వనపర్తి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.