సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Nov 03, 2020 , 03:50:56

దరఖాస్తులకు ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం

వనపర్తి : గిరిజన సంక్షేమశాఖ, ప్రభుత్వం సీఎం ఎస్టీ ఎంటర్‌ ప్రే న్యూర్‌ షిప్‌, ఇన్నోవేషన్‌ పథకం కింద అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి యాదమ్మ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె స్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌ ద్వారా సామర్థ్యాల పెంపుదలకు శిక్షణ, పరిశ్రమల, వ్యాపారుల ఏర్పాటుకు ట్రైకార్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించుటకు కోసం ఆసక్తి అర్హత కలిగిన గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను కోరుతున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం http://tsobmms.cgg.gov.in నందు సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రకటన ద్వారా కోరారు.