శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 03, 2020 , 03:50:56

ధరణి పోర్టల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభం

ధరణి పోర్టల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభం

ఆత్మకూరు : అమరచింత తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రారంభమైంది. ఆర్డీవో అమరేందర్‌ ముఖ్యఅతిథిగా హాజరై నూతన విభాగాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌పై అధికారుల కు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్ర వేశపెట్టిన ఈ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆత్మకూరు తాసిల్దార్‌ కా ర్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రార్‌ విభాగాన్ని పరిశీలించా రు. కార్యక్రమంలో అమరచింత తాసిల్దార్‌ సింధూజ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

   ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆత్మకూరులో ప్రారంభమైంది. స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో ఈ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం తాసిల్దార్‌ జేకే మోహన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ మీసేవా కేంద్రాల ద్వార భూముల క్రయవిక్రయాలకు సంబంధించి టైమ్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. పోర్టల్‌లోని సైన్‌ఇన్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటీపీ వస్తుందన్నారు. దాని ఆధారంగా పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రియాదవ్‌, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, మార్కెట్‌యార్డ్‌ వైస్‌చైర్మన్‌ నాగభూషణంగౌడ్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొని తాసిల్దార్‌కు శుభాభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నాయబ్‌ తాసిల్దార్‌ నందకిషోర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం ధరణి పోర్టల్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ విభాగాలను తాసిల్దార్‌ వెంకటకృష్ణ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రజలకు అందుబాటులో ధరణి సేవలు, రిజిస్ట్రర్‌ సేవలు మండల కేంద్రంలోనే అందించేందుకు ప్రా రంభించిందన్నారు. ఇక నుంచి మండలంలోని అన్ని గ్రా మాలకు సంబంధించిన రైతుల రిజిస్ట్రేషన్‌ సేవలు తాసిల్దార్‌ కార్యాలయంలోనే అందనున్నట్లు ఆయన తెలిపారు. 

రిజిస్ట్రేషన్‌లో మూడు శ్లాట్లు బుకింగ్‌

వీపనగండ్ల : మండల స్థాయిలోనే రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రెవె న్యూ కార్యాలయంలో ధరణి సేవలను సోమవారం ప్రారంభించినట్లు తాసిల్దార్‌ యేషయ్య తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు సోమవారం మూడు శ్లాట్లు బుకింగ్‌ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌ను మండల వాసులు వినియోగించుకోవాలని కోరారు.  

ధరణితో రైతులకు మేలు..

వనపర్తి రూరల్‌ : ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు, ఇతరులు వ్యవసాయ భూమి కొనుగోలు చేసే వారు మీ సేవలో రిజిస్ర్టేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. స్లాట్‌ సమయం ప్రకారం తాసిల్దార్‌ కార్యాలయానికి అన్ని పత్రాలతో వస్తే రిజిస్ర్టేషన్‌ కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు అన్నారు.