గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 01, 2020 , 03:14:49

ఆటోల్లో కెపాసిటీకి మించి...

ఆటోల్లో కెపాసిటీకి మించి...

  • పంట కోతల సమయం కావడంతో పెరిగిన  కూలీలు డిమాండ్‌

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిశాయి. అలాగే ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో బీళ్లుగా ఉన్న భూములు సాగుకు యోగ్యంగా మారాయి. కా గా, పంటలు కోత దశకు చేరుకోవడంతో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. ఎంత ఎక్కువ మంది వస్తే అంత త్వరగా కోతలు పూర్తవుతాయని.. రైతులు ఎక్కువ మంది కూలీలను సమకూర్చుకుంటున్నారు. ఎక్కువ కూలి చెల్లించడంతోపాటు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కూలీలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడంతో ఎలాగోలా వెళ్లాలని.. ఒక్క ఆటోలో 25 నుంచి 30 మంది ఒకరిపై ఒకరు కూర్చొని వెళ్తున్నారు. రైతులే ఉచితంగా ఆటోలను సమకూరుస్తుండడంతో ఇబ్బందులు ఉన్నా.. పదుల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి వెళ్తుండడంతో ఆటోలు బోల్తా పడుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉ న్నాయి. అవగాహన, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రతి ఏటా కూలీల ఆటోలు ప్రమాదానికి గురవుతున్నాయి.

పరిమితికి మించి..

ఆటో డ్రైవర్లు కూలీలను పంట పొలాల్లోకి తీసుకెళ్లేందుకు రైతులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు గ్రామాలకు వెళ్లి ముఖ్య కూడలిలో ఉన్న కూలీలను ఆటోలో ఎక్కిస్తున్నారు. మోటర్‌ వెహికిల్‌ చ ట్టం ప్రకారం ఒక ఆటోలో 3+1 మాత్రమే అనుమతి ఉన్నది. కానీ కూలీలను పంట పొలాలకు చేరవేసే ఆటోలో 25 నుంచి 30 మంది వరకు ప్రయాణిస్తున్నా రు. రైతులే ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తుండటంతో కూలీలు ఇబ్బందులు కలిగినా.. ఒకరిపై ఒకరు కూర్చొని పొలాలకు చేరుకుంటున్నారు. పదుల కి లోమీటర్ల మేర ఇలానే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్యాసింజర్‌ ఆటోల్లోనే కాకుండా ట్రాలీ వాహనాల్లో కూడా కూలీలను అధిక సంఖ్యలో పొలాల్లోకి చేరవేస్తున్నారు. ఇలా కెపాసిటీకి మించి ప్రయాణం చేస్తుండడంతో ప్రమాదాలు జరిగి మృత్యువాతపడుతున్నారు.ఇదిలా ఉండగా, కొవిడ్‌ నేపథ్యంలో విద్యాసంస్థలు ప్రారంభం కాకపోవడంతో.. బాలకార్మిక వ్యవస్థ పెరిగిపోతున్నది. రూ.300 నుంచి 400 వరకు కూలి చెల్లిస్తుండడంతో విద్యార్థులు పనులకు వెళ్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో విషాద ఘటనలు..

  • కూలీలతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడి పలువురు చనిపోతున్నారు. ప్రతి ఏడాది పంటల కోతల సమయం అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 
  • రెండేండ్ల కిందట జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం పారిచర్ల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. నవంబర్‌ నెలలో పత్తిమిల్లులో కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నది.  
  • రెండేళ్ల కిందట నవంబర్‌ నెలలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామం వద్ద కూలీల ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 
  • ఏడాది కిందట పెంట్లవెల్లి మండలం రామాపురం వద్ద మాదసాని నగర్‌కు చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా వనపట్ల గ్రామంలో గతేడాది ఆటో బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. 
  • గురువారం గద్వాల పట్టణంలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 
  • హెవీలోడ్‌తో వెళ్తున్న వాహనాల తనిఖీలు అంతగా లేకపోవడంతో వందల సంఖ్యలో ఆటోలు కూలీలను చేరవేస్తున్నాయి. పోలీస్‌, రవాణాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కూలీలు వెళుతున్న ఆటోలను తనిఖీ చేస్తే చాలా వరకు ప్రమాదాలను అరికట్టొచ్చు. 
  • చర్యలు తీసుకుంటాం..

ఆటోలో హె వీలోడ్‌తో ప్ర యాణికులను చే రవేస్తే చట్టపరమై న చర్యలు చేపడ తాం. ఒక్క ఆటో లో నలుగురికం టే ఎక్కువ మం ది ప్రయాణిస్తే యాక్షన్‌ తీసుకుంటాం. డ్రైవర్‌పై కేసు నమో దు చేసి వాహనాన్ని సీజ్‌ చేస్తాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రమాదాలు జరగకుం డా చర్యలు తీసుకుంటాం. డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. ప్రయాణికు    లు కూడా ఆలోచించాలి. 

- నరేందర్‌ నాయక్‌, డీటీవో, వనపర్తి