శుక్రవారం 04 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 30, 2020 , 02:04:34

ఉచిత పోలీస్‌ శిక్షణ

ఉచిత పోలీస్‌ శిక్షణ

వనపర్తి టౌన్‌ : పేద విద్యార్థులను ప్రయోజకులను చేసేందుకోసం విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం ప్రభుత్వం ఇంటర్‌ దశలోనే కానిస్టేబుల్స్‌ ఎంపిక కోసం ఉచిత శిక్షణను ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్‌ దశలోనే ఉచిత కానిస్టేబుల్‌ శిక్షణను ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు చెందిన ఈ ఏడాది 2064 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు కూడా ఉచిత శిక్షణకు అర్హత పొందవచ్చని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సింహయ్య చెప్పా రు.

ఈ శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు పాస్‌ ఫొటోలు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ మెమోలు, బోనఫైడ్‌, కుల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 31వ తేదీలోగా కళాశాలలో సమర్పించాలన్నారు. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి శారీరక (ఫిజికల్‌) టెస్ట్‌ ఉంటుందని చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే 9490078683, 9493232315 నంబర్లను సంప్రదించాలని డీఐఈవో చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, గతం లో ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినిగియోగించుకోవాలన్నారు.