బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Oct 30, 2020 , 02:04:28

కంది, వరి పంటలపైరైతులకు శిక్షణ

కంది, వరి పంటలపైరైతులకు శిక్షణ

వనపర్తి రూరల్‌ : మండలంలోని చందాపూర్‌, దత్తయిపల్లి గ్రామాల్లో గురువారం గ్రామ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా కంది, వరి పంటలపై  రైతులకు మండల వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కురుమయ్య మాట్లాడుతూ చందాపూర్‌, దత్తయిపల్లి గ్రామ శివారులో రైతులు వేసిన వరి, కంది పంటలపై శిక్షణ, తెగుళ్లుపై అవగాహన కల్పించామన్నారు. కందిలో తెగుళ్ల నివారణకు రైతులు పూత, ఆకు చుట్టు పురుగు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని, ముందుగానే వాటిని గుర్తించి క్లోరోపైరిపాస్‌ 50 శాతం, ఈసీ 2మి.లీతోపాటు వేపనూనె 5 మి.లీ లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అలాగే వరిలో సుడిదోమ, కంకినల్లి, మానిపండు తెగుళ్లు కూడా గుర్తించమని చెప్పారు. వాటి నివారణకు రైతులు డైనటోపురాన్‌ వంద గ్రాములు లేదా పెక్సలాన్‌ 94 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఇతర సమస్యలకు వ్యవయసాయ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే చిట్యాల గ్రామంలోని రైతులకు ఏఈవో అహల్య కంది, వరి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చందాపూర్‌ గ్రామ సర్పంచ్‌ చెన్నారెడ్డి, ఏఈవోలు అహల్య, సురేశ్‌, రైతులు వెంకట్‌రెడ్డి, రాములు, నర్సింహారెడ్డి, కృష్ణయ్య, రైతులు పాల్గొన్నారు.

పెబ్బేరులో..

పెబ్బేరు రూరల్‌ : పెబ్బేరు మండలంలో చేతికొచ్చిన వరి పంటకు తెగుళ్లు ఆశించి నష్టం కలుగజేస్తున్నందున రైతు లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఏవో దేవప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన రాంపురం గ్రా మంలోని వరి పైర్లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పురుగులు, తెగుళ్ల నివారణకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈవోలు నరేశ్‌, ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.