శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 29, 2020 , 03:01:51

తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు

  • పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

వనపర్తి రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు బుధవారం  పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దగూడెం, చిమనగుంటపల్లి, దత్తాయిపల్లి తదితర గ్రామాల్లో వ్యవసాయ అధికారి కురుమయ్య పరిశీలించి వరిలో సుడిదోమ, కంకినల్లి, మానిపండు తెగుళ్లు, వేరుశనగలో ఆకుముడత తెగుళ్లను గుర్తించినట్లు తెలిపారు. వరి పంటలో సుడిదోమ తెగులు మొదటి దశలో దుబ్బకు 2 నుంచి 6 దోమలు గమనిస్తే బుప్రోపుజిన్‌ 300గ్రాములు, ఉధృతి అధికంగా ఉంటే పైమెట్రిజన్‌ 120 గ్రాములు /డైనటోపురాన్‌ 100గ్రాములు / పెక్సలాన్‌ 94ను ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

అలాగే  కంకినల్లి, మానిపండు తెగుళ్ల నివారణకు ప్రోపికోనజోల్‌ 400 మి.లీ, స్పైరోమైసిపిన్‌ 200 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అదేవిధంగా వేరుశనగలో  ఆకుముడత నివారణకు క్లోరోపైరిఫాస్‌ 2 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఇతర సమస్యలున్న రైతులు వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి సలహాలు, సూచనలతో పంట తెగుళ్ల నుంచి రక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు  వంశీ, సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.