సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 28, 2020 , 02:08:51

చేనేత హస్తకళల ప్రదర్శన

చేనేత హస్తకళల ప్రదర్శన

వనపర్తి : చేనేత వస్ర్తాలకు ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పా టు చేశారు. స్థానిక ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో చేనేత వస్ర్తాలు, హస్తకళలకు సంబంధించి వస్తు సామగ్రిని విక్రయిస్తున్నారు. ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో అఖిల భారత హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. 

అందుబాటులో వస్త్ర సామగ్రి

కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, నిర్మల్‌ టాయిస్‌, హైదరాబాద్‌ నుంచి ముత్యాలు, మైసూర్‌ రోజ్‌వుడ్‌, సహారన్‌పూర్‌, వుడ్‌ కార్వింగ్‌, వరంగల్‌ లెదర్‌ బ్యా గులు, బంజార ఎంబ్రాయిడరి, బెంగాల్‌ జ్యూట్‌ బ్యాగు లు, ఒక గ్రాము గోల్డ్‌ ఆభరణాలు, గాజులు, కళాత్మక ఆభరణాలు, గృహలంకరణ వస్తువులను విక్రయిస్తున్నారు. 

చేనేత వస్ర్తాలు.. 

చేనేత వస్ర్తాల్లో పోచంపల్లి, బెడ్‌షీట్స్‌, డ్రెస్‌ మెటీరియల్‌ అండ్‌ శారీస్‌, కళంకారి, ఖాదీ వస్ర్తాలు, మంగళగిరి చీరలు, బ్లౌజు మెటీరియల్స్‌, వరంగల్‌ టవల్స్‌, హైదారాబద్‌ ఎంబ్రాయిడ్‌ చీరలు, గద్వాల చీరాల డ్రస్‌ మెటీరియల్స్‌, చీరలు, మీరట్‌ ఖాది షర్ట్స్‌, బెంగాలీ కాటన్‌ చీరలు, వంటి వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయి.