బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 28, 2020 , 00:36:10

వరద తగ్గుముఖం

వరద తగ్గుముఖం

  • ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 5 గేట్లు, శ్రీశైలం డ్యాం 2 గేట్ల ద్వారా నీటి విడుదల
  • తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్‌కూ స్వల్ప ఇన్‌ఫ్లో వరద తగ్గుముఖం

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్‌లో 5గేట్లను ఎత్తి నదిలోకి 35,965 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 73,500 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 73,569 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులుండగా ప్రస్తుతం 1044.554అడుగులతో పూర్తి స్థాయిలో నీరు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా 9.377టీఎంసీలుగా నీరు చేరుకుంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 29,696 క్యూసెక్కులుండగా అవుట్‌ ఫ్లో 29,696 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1705.00 అడుగులుండగా ప్రస్తుతం1704.72 అడుగులకు నీరు చేరుకున్నాయి. నారాయణపూర్‌ ఇన్‌ఫ్లో 29,599 క్యూసెక్కులుగా అవుట్‌ ఫ్లో 29,453 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులుండగా ప్రస్తుతం 1614.99 అడుగులకు నీరు చేరుకుంది. 

తుంగభద్రకు స్థిరంగా వరద

అయిజ : టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 20,939 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 20,579 క్యూసెక్కులుగా నమోదైంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

ఆర్డీఎస్‌కు నిలకడగా వరద

ఆర్డీఎస్‌ ఆనకట్టకు 24,409 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 23,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 509క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. 

శ్రీశైలానికి తగ్గుముఖం పట్టిన వరద

శ్రీశైలం: శ్రీశైల జలాశయానికి వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. రెండు క్రస్ట్‌గేట్లను 10 అడుగుల ఎత్తులో తెరిచి దిగువన ఉన్న సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకు ఇన్‌ఫ్లో 98,756 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 89,740 క్యూసెక్కులుగా నమోదైంది. మంగళవారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్‌ ద్వారా 71,037 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 12,933 క్యూసెక్కుల (మొత్తంగా 83,970 క్యూసెక్కులు) నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా నీటి సామర్థ్యం 215.807 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.