సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Oct 28, 2020 , 00:36:08

తెలంగాణ ధాన్యానికి ఫుల్‌ డిమాండ్‌

తెలంగాణ ధాన్యానికి ఫుల్‌ డిమాండ్‌

  • ఎఫ్‌సీఐ రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ అశ్విన్‌కుమార్‌ గుప్తా 

దేవరకద్ర రూరల్‌ : గోదాముల్లో ధాన్యపు నిలువలు పాడవకుండా, ధాన్యానికి నీటి తుంపరలు తగలకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ధాన్యానికి దేశంలోనే చాలా రాష్ర్టాల్లో బాగా డిమాండ్‌ ఉందని ఎఫ్‌సీఐ రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ అశ్విన్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎఫ్‌సీఐ ధాన్యం నిలువ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గోదాములను ఆయన తనిఖీ చేశారు. ముందుగా గోదాముల వద్ద ఉన్న శ్రీసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గోదాముల కార్యాలయంలో ధాన్యం నిలువ పట్టికలను ఆయన పరిశీలించారు. గోదాముల సామర్థ్యం లక్ష ఆరువేల మెట్రిక్‌ టన్నులు కాగా ప్రస్తుతం 61 వేల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం ధాన్యం ఎప్పుడు వచ్చింది.. ఎంత వచ్చిందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏజీఎం మునిరాజు, డీఎం ఎస్‌ఎస్‌ సింగ్లా, గోదాం నిర్వాహకులు కృష్ణారెడ్డి, రాములు ఉన్నారు.