శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 27, 2020 , 04:37:14

ఘనంగా విజయదశమి

ఘనంగా విజయదశమి

  • శమీపూజలో పాల్గొన్న సంస్థానాధీశులు, మంత్రులు
  • ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

వనపర్తి టౌన్‌/రూరల్‌/గోపాల్‌పేట/ఆత్మకూరు/పాన్‌గల్‌/ఖిల్లాఘణపురం/కొత్తకోట/పెద్దమందడి/వీపనగండ్ల : జిల్లా కేంద్రంలో దసరా పండుగ అంగరంగవైభవంగా జరిగింది. సాంప్రదాయ ప్రకారం వనపర్తి సంస్థానాధీశులు కృష్ణదేవరాయలు ఆదివారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఉన్న ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పాతబజార్‌లో ఉన్న జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ పూజలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వాకిటీ శ్రీధర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

శుభాకాంక్షలు తెలిపిన ముస్లింలు

దసరా సందర్భంగా వనపర్తికి చెందిన ముస్లిం మతపెద్దలు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముస్లింలు సర్దార్‌ఖాన్‌, గులాంఖాదర్‌, ఆక్తర్‌, యూనిస్‌, ఆయా మసీదుల మత పెద్దలు ఉన్నారు.

 జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని ఆయా గ్రా మాల్లో ప్రజలు విజయ దశమి పర్వదినాన్ని ఆదివారం ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నా రు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆయుధపూజలు, జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వనపర్తి మండలం రాజపేట, పెద్దగూడెం, కడుకుంట్ల, సవాయిగూడెం, అంకూ ర్‌, చిమనగుంటపల్లి గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ప్రజలకు దసరా పండు గ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అంకూర్‌ గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు.

గోపాల్‌పేట మండలంలోని ఆ యా గ్రామాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలకు భక్తులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. సాయం కాలం గ్రామస్తులంతా కలిసి జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజలు చేశారు. ఆత్మకూరు, అమరచింత మండలాల్లో దసరా వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూరు జాతర మైదానంలో షీమోల్లంఘన, శమీపూజలను వేదపండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. చైర్‌పర్సన్‌ గాయత్రిరవికుమార్‌యాదవ్‌ దంపతులు, పాలకవర్గం ప్రతినిధులు శమీపూజను నిర్వహించారు. పాన్‌గల్‌ మండలకేంద్రంతోపాటు కేతేపల్లి, రేమద్దుల, అన్నారం, అన్నారంతండా, దవాజీపల్లి, తెల్లరాళ్లపల్లి తదితర గ్రామాల్లో దసరా ఉత్సవాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పాన్‌గల్‌ మండలకేంద్రంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, కేతేపల్లిలో సింగిల్‌విండో చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, అన్నారం, అన్నారం తండాలో జెడ్పీటీసీ లక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఖిల్లాఘణపురం మం డల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం విజయదశమి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.

సోమవారం అన్ని గ్రామాల ప్రజలు కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఆగారం గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహానికి ఆదివారం నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకోట పట్టణంలో విజయ దశమి సందర్భంగా గ్రామ చావిడి వద్ద జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌ గౌడ్‌, ఎంపీపీ మౌనిక, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, వైస్‌ చైర్‌ పర్సన్‌ జయమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల నారాయణ ఆయుద పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి పాత జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జమ్మీ చెట్టుకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా రామాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. బస్టాండ్‌ ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. పెద్దమందడి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఆదివారం విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామంలోని ఆలయాల నుంచి భక్తులు భజనలు చేసుకుంటు జమ్మిచెట్టు వద్దకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వీపనగండ్ల మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు ఆలయాల్లో ఆదివారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని వీపనగండ్లలో స్లోబైక్‌ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ శివరంజని, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ సీతయ్య, సర్పంచులు గోపాల్‌రెడ్డి, అనిత, రాములు, రంగానాయక్‌, మంజుల, వెంకటయ్యయాదవ్‌, ఎంపీటీసీలు శ్యామల, కర్ణాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హనుమంతురెడ్డి, జయాకర్‌, శ్రీకాంత్‌, రవి, శంకర్‌, రాజు, గోపాల్‌, బురన్‌, శ్రీను, నరేందర్‌, విక్రమ్‌, వెంకటేశ్‌, ఆగారం పుల్లయ్యమాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, ఉమ్మడి జిల్లాల ఆధికార ప్రజాప్రతినిధి ప్రశాంత్‌,  కౌన్సిలర్లు రామ్మోహన్‌రెడ్డి, భరత్‌భూషన్‌, నారాయణమ్మ, మహేశ్వరి, సంధ్య రాణి, పద్మమ్మ, తిరుపతయ్య, ఖాజామైనొద్దీన్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ యాదయ్య సాగర్‌ కోఆప్షన్‌ సభ్యులు సుజాత, వాసీంఖాన్‌, వాహీద్‌, నాయకులు శ్రీను, రాములుయాదవ్‌, శ్రీనుజీ, బాబు, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాబురెడ్డి, కృష్ణరెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రశాంత్‌, వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.