శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 25, 2020 , 01:10:38

భక్తి శ్రద్ధలతో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

భక్తి శ్రద్ధలతో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

వనపర్తి టౌన్‌/రూరల్‌ : జిల్లా కేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలోని భువనేశ్వరి మాత విగ్రహానికి పూజరి రవీంద్రరావు అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు బాలరాజు, అధ్యక్షుడు కృష్ణమోహ న్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శ్రీనివాసులు, సురేశ్‌, చంద్రు డు, వేణుగోపాల్‌, యువజ న సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌, శివ, సందీప్‌, మహిళ అధ్యక్షురాలు మంజుల, ఉమా, భాగ్య, మంజుల, వేంకటేశ్వర ఆల య ధర్మకర్త రఘునాథచార్యులు పాల్గొన్నారు. 

గోపాల్‌పేట : మండలంలో దేవీశరన్నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలు, ఆనందోత్సవాలతో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివాం గోపాల్‌పేట శివాలయంలో సుహాసిని దేవిగా, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మహిషాసుర మర్ధినిగా, పోల్కెపహాడ్‌లో దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పొల్కెపహాడ్‌లో అమ్మవారి పూజా, సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, సర్పంచ్‌ రజని, ఎంపీటీసీ రత్నకుమారి హాజరయ్యారు. పూజారులు లవకుమా ర్‌ ఆచారి ఆధ్వర్యంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజ లు చేశారు. పూలతో అలంకరించిన సద్దుల బతుకమ్మలతో మహిళలు తరలివచ్చారు. బతుకమ్మలను అమ్మవారి వద్ద ఉంచి పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు. బతుకమ్మలతో వచ్చిన మహిళలకు గ్రామానికి చెందిన కేశవులు 30 చీరెలను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. 

దుర్గాదేవిగా..

పెబ్బేరు : పట్టణంలోని కన్యాకాపరమేశ్వరీ ఆలయంలో శనివా రం వాసవీ మాత దుర్గాదేవిగా భక్తులకు దర్శినమిచ్చింది. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకంతోపాటు భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య పూజారి నవీన్‌కుమార్‌, నాగరత్నమ్మ, విజయలక్ష్మీ, పుష్పావతి, లావణ్య, అశ్వీని, అనిత, భక్తులు పాల్గొన్నారు.

శ్రీమహాలక్ష్మి దేవిగా..

కొత్తకోట : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి మాతను మహాలక్ష్మిదేవిగా అలంకరించారు. చంద్రమౌళీశ్వర, మార్కండేయస్వా మి, అంబాభవానీ ఆలయాల్లో అమ్మవారిని దుర్గాదేవిగా అ లంకరించారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, కుంకుమార్చన, హోమం, లక్ష్మిహోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలనారా యణ, నర్సింహ, భీమా చంద్రకాంత్‌, శ్రీను, రాజు, చంద్రశేఖర్‌, నాగరాజు, సత్యనారాయణ, ప్రసాద్‌, అనిల్‌ ఉన్నారు.

ఖిల్లాఘణపురంలో..

ఖిల్లాఘణపురం : దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శనివారం ఆగారం గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. 

మహిషాసురమర్ధినిగా..

కొత్తకోట రూరల్‌ : మండలంలోని కానాయపల్లిస్టేజీ సమీపం లో ఉన్న కోటిలింగేశ్వర దత్తా దేవస్థానంలో జ్ఞానాంభిక దేవి శనివారం మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకు లు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 

కన్యకాపరమేశ్వరీ ఆలయంలో..

పాన్‌గల్‌ : మండలంలోని కేతేపల్లి కన్యకాపరమేశ్వరీ ఆలయం లో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్ర త్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయంలో కుంబాభిషేకం, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి మదన్‌మోహన్‌, వీరన్నశెట్టి, శ్రీనివాసులు, రాంబాబుశెట్టి, ప్రశాంత్‌, మాణిక్యం, సుబ్రమణ్యం పాల్గొన్నారు.

మదనాపురంలో..

మదనాపురం : మండల కేంద్రంలోని పెద్దమ్మవారి శాలలో మహిషాసుర మర్ధిని, చిన్నమ్మవారి శాలలో దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు గోపిస్వామి, రామబ్రహ్మం, సాయిమిత్ర ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, అష్టోత్తర, సహస్ర నామాలతో అమ్మవారికి, శివలింగానికి విశిష్ట పూజలు జరిపించారు. ఎంపీపీ జన్ను పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్యతో కలిసి అమ్మవారికి ప్ర త్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సరళాదే వి, సర్పంచ్‌ రాంనారాయణ, టీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ సత్యం యాదవ్‌, నాయకులు వెంకట్‌స్వామి, సాయిలు యాద వ్‌, విజయ్‌, ఆర్యవైశ్య కులస్తులు శ్రీనివాస్‌, సుచరిత, విజయలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.