ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Oct 25, 2020 , 00:16:35

జోగుళాంబ దర్శనం అదృష్టం

జోగుళాంబ దర్శనం అదృష్టం

  • అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
  • వ్యవసాయ రాష్ట్రంగా ఉజ్వల భవిష్యత్‌
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • వైభవంగా జోగుళాంబ దేవి రథోత్సవం
  • పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి

అలంపూర్‌ : రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతు న్న పథకాలతో వ్యవసాయ రాష్ట్రంగా ఖ్యాతి కెక్కిందని, దేశానికే తలమానికంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మంత్రి దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి వి లేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో భూగర్భజలాలు అధికంగా పెరిగాయన్నారు. కొన్ని ప్రాంతా ల్లో నష్టం కూడా వాటిల్లిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాలను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్ల గురించి సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో దేవాదాయ శాఖ మంత్రి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితతిరుపతయ్య, ఎమ్మెల్యే అబ్రహం, మాజీ జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, క న్జూమర్‌ ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప తదితరులు ఉన్నారు.

మహాగౌరీ దేవిగా..

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు జోగుళాంబ అమ్మవారు మహాగౌరీ దేవిగా దర్శనమిచ్చారు. సర్వ వస్ర్తాలు, సర్వ ఆభరణాలు అమ్మ వారి శ్వేత వర్ణంలో ఉంటాయి. మహాగౌరిని ఆరాధించడం వల్ల పూర్వజన్మ పాపకర్మలు ప్రక్షాళన చేయబడతాయని భక్తుల నమ్మకం. కాగా, యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు యాగశాలలో చండీహోమాలు కొనసాగించారు. ఉదయం 9 గంటలకు రథాంగ హోమం చేశారు. 10 గంటలకు అమ్మవా రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ముందుగా ఈవో ప్రేమ్‌కుమార్‌, అర్చకులు రథానికి పూజలు చేశారు. పురవీధుల మీదుగా రథోత్సవ శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. రథం ఆలయం వద్దకు చేరుకున్న తర్వా త అర్చకులు అమ్మవారికి నవాన్న సహిత నివేదన సమర్పించారు. సాయంత్రం ఆరు గంటలకు ఏకాంత ప్రదోషకాల అ ర్చన నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అలాగే అ మ్మవారిని కలెక్టర్‌ శృతిఓఝా దర్శించుకున్నారు.