బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 25, 2020 , 00:16:35

ఎస్సై శిక్షణ పూర్తి చేసుకున్న సురేశ్‌కుమార్‌కు సన్మానం

ఎస్సై శిక్షణ పూర్తి చేసుకున్న సురేశ్‌కుమార్‌కు సన్మానం

మదనాపురం : మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అనుమోని ఆంజనేయులు జ్యోతి దంపతుల కుమారుడు అనుమోని సురేశ్‌కుమార్‌ ఆర్‌బీవీ ఆర్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 12వ బ్యాచ్‌ ఎస్సైల శిక్షణ పూర్తిచేసుకొని శనివారం స్వగ్రామం చేరుకున్నారు. దీంతో మాజీ ఎంపీపీ మహదేవన్‌గౌడ్‌ దంపతులు, ఎంపీటీసీ శాంతమ్మతో కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహదేవన్‌గౌడ్‌ మాట్లాడుతూ సురేశ్‌కుమార్‌ మున్ముందు ఉన్నత శిఖరాలకు చేరుకొని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మీనారాయణ, రాంచందర్‌, మహేందర్‌యాదవ్‌, వార్డు సభ్యులు లక్ష్మయ్యయాదవ్‌, కుర్మన్న, ఆంజనేయులు, రాములు పాల్గొన్నారు.