శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Oct 25, 2020 , 00:16:32

వార్డులో సూచికల బోర్డు ఏర్పాటు

వార్డులో సూచికల బోర్డు ఏర్పాటు

వనపర్తి : జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో వార్డు పేర్లమీద సూచికల బోర్డులను శనివారం ఏర్పాటు చేశామని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా వనపర్తి ఏర్పడిన తర్వాత పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుందన్నారు. అందుకు అనుగుణంగా వార్డులో కాలనీ పేర్లతో సూచికలను ఏర్పాటు చేయడంతో నూతన వ్యక్తులకు ఇబ్బందులు కలుగవని ఆయన వివరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు విశ్వేశ్వర్‌రెడ్డి, బాబుగౌడ్‌, కొండన్న, నారాయణ, నాగరాజు, నరసింహ, శివ, బాలరాజు, రవీందర్‌రెడ్డి ఉన్నారు.