సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 25, 2020 , 00:16:58

ఎంపీపీ కుటుంబానికి మంత్రి పరామర్శ

ఎంపీపీ కుటుంబానికి మంత్రి పరామర్శ

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం శ్రీరంగాపురంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల వృద్ధాప్యంతో ఎంపీపీ గాయత్రి అమ్మమ్మ, టీఆర్‌ఎస్‌ మండల సమన్వయకర్త పృధ్వీరాజు తల్లి అలివేలుమంగమ్మ మృతి చెందారు. ఆమె దశదినకర్మ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అలాగే అనారోగ్యంతో మరణించిన టీఆర్‌ఎస్‌ నాయకుడు వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల ఆర్థికసాయాన్ని కుటుంబ స భ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు జగన్నాథంనాయుడు, ఉపాధ్యక్షుడు వెంకట య్య, నా యకులు వెంకటయ్య, మహేశ్‌గౌడ్‌, సంపత్‌ పాల్గొన్నారు.