సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 23, 2020 , 04:31:17

కొనసాగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

కొనసాగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

మదనాపురం/వనపర్తిటౌన్‌/రూరల్‌/కొత్తకోట/రూరల్‌ : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు గురువారం మండ ల కేంద్రంలోని పెద్దమ్మవారి శాలలో రాజరాజేశ్వరిదేవిగా, చిన్నమ్మవారి శాలలో ధనలక్ష్మిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు గోపిస్వామి, రామబ్ర హ్మం, సాయిమిత్ర ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వనపర్తి జిల్లా కేం ద్రంలోని రామాలయం, లక్ష్మీగణపతి ఆల యం, వేంకటేశ్వరస్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అర్చకులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేసి ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలోని సీతారామంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శమించారు. కొత్తకోట మండలం కానాయప ల్లి స్టేజీ సమీపంలో ఉన్న శ్రీకోటిలింగేశ్వర దత్తా ఆలయం లో శ్రీజ్ఞానాంభిక దేవి శ్రీలక్ష్మీదేవిగా ప్రత్యేక అలంకరణ లో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కొత్తకోట పట్టణం అంబాభవానీ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మిదేవిగా, చంద్రమౌళీశ్వర మార్కండేయస్వామి ఆలయంలో సరస్వతీ దేవిగా, కన్యకాపరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరి దేవిగా అలంకరించారు. కార్యక్రమంలో మదనాపురం ఆలయ కమిటీ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురా లు సరళాదేవి, వెంకట్‌ప్రసాద్‌, కన్యకాపరమేశ్వరి ఆలయ గౌరవ అధ్యక్షుడు బాలరాజు, అధ్యక్షుడు కృష్ణమోహన్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శ్రీధర్‌, పాండయ్య, చంద్రు డు, ప్రవీణ్‌కుమార్‌, సాయిబాబా, వేణుగోపాల్‌, యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌, శంకర్‌, శివ, ప్రేమ్‌, మహిళ అధ్యక్షురాల మంజుల, వాణి, శ్రీకాంత్‌, సుస్మిత, మంజుల, భాగ్య, నలిని, దీప, శిరీష, కొత్తకోట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలనారాయణ, భీమాచంద్రకాంత్‌, శ్రీను , రాజు, నర్సింహ, చంద్రశేఖర్‌, నాగరాజు, సత్యనారాయణ, ప్రసాద్‌, అనిల్‌ పాల్గొన్నారు.