శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 23, 2020 , 04:31:14

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు

ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు

వనపర్తి : ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్లకు, సిబ్బందికి హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్‌ రాఘవులు అందరిని పరీక్షించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ కరో నా వంటి విపత్కర సమయంలో మున్సిపల్‌ సి బ్బంది అందించిన సేవలను ఎనలేనివని, అలాంటి వారి ఆరోగ్యమే మా భద్రతగా భావించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణ, సత్యం, కోఆప్షన్‌ సభ్యులు గులాం ఖాదర్‌, ఆశ వర్కర్‌ తిరుపతమ్మ, నాగేశ్వరమ్మ ఉన్నారు.