శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 02:55:10

ప్రజల ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలి

ప్రజల ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలి

  • వనపర్తి సంస్థానాధీశులు రాజ కృష్ణదేవరాయలు 

వనపర్తి : పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రజల ఆస్తిని ప్రజలే కాపాడుకోవాలని వనపర్తి సంస్థానాధీశులు రాజ కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మాట్లాడారు. పట్టణం నడిబొడ్డున మూడెకరాల 20గుంటల భూమి దేవస్థానానికి చెందినదని, ఆ భూమికి తాను వంశపారంపర్యంగా ధర్మకర్తను మాత్రమే తప్ప యజమానిని కాదని స్పష్టం చేశారు. 1968లో ఆ భూమిని కొనుగోలు చేసి 1973లో దేవస్థానానికి అప్పగిస్తూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కల్యాణమండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని చెప్పానన్నారు.

ప్రైవేట్‌ వ్యక్తులకు ఈ భూమిపై ఎలాంటి హక్కులు లేవని, నాపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరో నాకు తెలియదన్నారు. మా తండ్రి రాజారామేశ్వర రావు కోరిక మేరకు ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని దేవదాయశాఖను కోరారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో వాదనలు ఉన్నందున కోర్టు ఆదేశాల తర్వాత దేవదాయశాఖ స్వాధీనం చేసుకుంటుందన్నారు.

ఈ విలువైన భూమిని కాపాడుకోవడంలో ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు నందిమల్ల అశోక్‌, వెంకటయ్య యాదవ్‌, కిరణ్‌కుమార్‌, సతీష్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.