శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 02:55:10

పూజలందుకుంటున్న అమ్మవారు

పూజలందుకుంటున్న అమ్మవారు

వనపర్తి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని రామాలయం, లక్ష్మీగణపతి, వేంకటేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో బుధవారం వివిధ రూపాల్లో అమ్మవారు పూజలందుకున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో లలితాంబికా మాతగా అలంకరించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పూరి బాలరాజు, అధ్యక్షుడు కృష్ణమోహన్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శ్రీధర్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, చంద్రుడు, ప్రవీణ్‌కుమార్‌, సాయిబాబా, వేణుగోపాల్‌, యువజన సంఘం అధ్యక్షుడు డప్పు వెంకటేశ్‌, శంకర్‌, శివ, ప్రేమ్‌, మహిళా అధ్యక్షురాలు మంజుల, ఉమావతి, వాణి, శ్రీకాంత్‌, సుస్మిత, మంజుల, భాగ్య పాల్గొన్నారు. 

మదనాపురంలో..

మదనాపురం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు మండల కేంద్రంలో దుర్గామాతను సరస్వతీదేవి అలంకరణలో భక్తులు పూజలు చేశారు. చదువులతల్లి సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు గోపిస్వామి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సరళాదేవి, నరేందర్‌ పద్మావతి, రాఘవేంద్ర అనిత, రవికుమార్‌ సరస్వతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పెబ్బేరులో..

పెబ్బేరు : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం అమ్మవారిని సరస్వతీదేవి అవతారంలో అలంకరించి పూజలు చేశారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి నవీన్‌ కుమార్‌శర్మ, పుష్పావతి, నాగరత్నమ్మ, విజయలక్ష్మి, అనిత, అశ్విని, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

లలితా త్రిపురసుందరీదేవిగా..

కొత్తకోట : పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం అమ్మవారిని లలితా త్రిపురసుందరీదేవిగా అలంకరించారు. అంబాభవాని ఆలయంలో లలితాంబికా అలంకరణలో,  చంద్రమౌళీశ్వర మార్కండేయస్వామి ఆలయంలో శాకాంబరిదేవిగా అలంకరించి పూజలు చేశారు. కార్యక్రమంలో మర్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలనారయణ, భీమాచంద్రకాంత్‌, కొండ శ్రీను, మేడిశెట్టి రాజు, నర్సింహ, సూర చంద్రశేఖర్‌, సూర నాగరాజు, సూర సత్యనారయణ, ప్రసాద్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధనలక్ష్మిగా దుర్గమ్మ

ఆత్మకూరు: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారిని రూ.30లక్షల కరెన్సీనోట్లతో అలంకరించారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు విజయ్‌కుమార్‌శెట్టి, నర్సింహయ్యశెట్టి, లక్ష్మీనారాయణ, వేణుగోపాల్‌శెట్టి, సత్యనారాయణ, శ్రీనివాసులు, గోపాల్‌శెట్టి, కల్వరాజు, యువజన సంఘం ప్రతినిధులు కృష్ణయ్య, పులిమామిడి రమేశ్‌, రమేశ్‌, భరత్‌, రాముని నీలేశ్‌, తాండూరు కిషోర్‌, తాండూరు పవన్‌, చింతల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రాజరాజేశ్వరిదేవి అలంకరణలో..

పాన్‌గల్‌: మండలంలోని కేతేపల్లి, గోప్లాపూర్‌, మాందాపూర్‌లో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కేతేపల్లి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి పూజలు చేశారు.

పెద్దమందడిలో..

పెద్దమందడి: మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బుధవారం దుర్గామాతను లలితాదేవిగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. 

గాయత్రీదేవిగా అమ్మవారు

వనపర్తి రూరల్‌: మండలంలో అమ్మవారిని బుధవారం గాయత్రీదేవిగా అలంకరించారు. కిష్టగిరిలోని సీతారామంజనేయస్వామి ఆలయంలోని భువనేశ్వరి మాత విగ్రహానికి ఆలయ పూజారి రవీంద్రశర్మ అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేశారు. అలాగే అంకూర్‌, పెద్దగూడెం, చీమనగుంటపల్లి తదితర గ్రామాల్లో మహిళలు పూజలు చేసి బతుకమ్మ ఆడారు.

కానాయపల్లి స్టేజి వద్ద..

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజి వద్ద కోటి లింగేశ్వరదత్త దేవస్థానంలో అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు కుంకుమార్చనతోపాటు ప్రత్యేక పూజలు చేశారు.