మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 00:06:38

జిల్‌జిల్‌ జిగేల్‌

జిల్‌జిల్‌ జిగేల్‌

  • ఆల్‌టైం రికార్డ్‌.. జూరాల విద్యుదుత్పత్తి
  • జూలై 14 నుంచి నిరాటంకంగా..
  • రోజుకు 8 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌
  • ఈ ఏడాది టార్గెట్‌ 361 మిలియన్‌ యూనిట్లు 
  • ఇప్పటికే 592 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి
  • గతేడాది 639 మిలియన్‌ యూనిట్లు..

జూరాలలో పవర్‌ ప్రాజెక్టు విద్యుత్‌ వెలుగులను విరజిమ్ముతోంది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు జల విద్యుత్కేంద్రానికి వరంగా మారింది. దీంతో అప్పర్‌, లోయర్‌ జూరాలలో జూలై 14 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. మొత్తం 12 యూనిట్లకుగానూ 11 యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 8 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతున్నది. గతేడాది 639 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి  చేయగా.. ఈసారి 361 మిలియన్‌ యూనిట్లు టార్గెట్‌ కాగా.. ఇప్పటికే 592 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అయింది. దీంతో త్వరలో ఆల్‌టైం రికార్డును సొంతం చేసుకోనున్నది.

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వస్తున్న వరద.. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్‌ కేంద్రానికి వరంలా మారింది. ఈ ఏడా ది జూలై 14వ తేదీ నుంచి జూరాలకు వరద రాక మొ దలైంది. దీంతో ప్రియదర్శిని జూరాల, లోయర్‌ జూ రాలలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. రెండు వి ద్యుత్కేంద్రాల ద్వారా రోజుకు దాదాపుగా 8 మిలియ న్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కాగా, గతేడా ది జూలై 31న విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా 639 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. గత రికార్డును బ్రేక్‌ చేసే దిశగా ప్రస్తుతం విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ఇప్పటివరకు అప్పర్‌, లోయర్‌ జూ రాలలో కలిపి 592 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చే శారు. ఈ సీజన్‌ ముగిసే నాటికి ఆల్‌ టైం రికార్డు వి ద్యుదుత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

గత రికార్డుల బ్రేక్‌ దిశగా..

గత పదేండ్ల రికార్డును తిరగరాసేలా జూరాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. ప్రియదర్శిని జూరా ల (అప్పర్‌), లోయర్‌ జూరాల పవర్‌ ప్లాంట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఒక్కో పవర్‌ ప్లాంట్‌లో 6 యూనిట్ల చొప్పున మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌ 39 మెగావాట్ల కెపాసిటీని కలిగి వి ద్యుదుత్పత్తి చేయగలదు. ఈ ఏడాది ఎగువ నుంచి వరద రాగానే మొదటగా పవర్‌హౌస్‌కు నీటిని విడుద ల చేశారు. అప్పర్‌ జలవిద్యుత్‌ కేంద్రంలోని ఆరు యూనిట్లలో ఐదు యూనిట్ల ద్వారా, లోయర్‌ జూరాలలో ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నా రు. జూలై 14 నుంచి వరద ప్రారంభం కావడంతో.. మొదటి రోజు పవర్‌హౌజ్‌కు 13,401 క్యూసెక్కులు విడుదల చేసి రెండు యూనిట్లను ప్రారంభించారు. క్రమేపీ వరద పెరగడంతో 11 యూనిట్లను ప్రారంభించి.. దాదాపుగా 40,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఒక్కో యూనిట్‌ ద్వారా రోజుకు 0.964 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొ చ్చు. ఈ క్రమంలో రెండు విద్యుత్కేంద్రాల ద్వారా రో జుకు దాదాపుగా 8 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్ప త్తి చేసే అవకాశాలున్నాయి. 

గతేడాది 639 మిలియన్‌ యూనిట్లు..

గతేడాది జూలై 31వ తేదీన విద్యుదుత్పత్తిని ప్రా రంభించిన అధికారులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేశా రు. పదేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా 639 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. అప్పర్‌ జూరాల నుం చి 321, లోయర్‌ జూరాల నుంచి 318 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఒకానొకదశలో దాదాపుగా 8 లక్షల క్యూసెక్కుల వరద జూరాలకు చేరుకుంది. వరద ధాటికి తట్టుకొనే సామర్థ్యం లేకపోవడంతో దా దాపుగా 10 రోజుల పాటు విద్యుదుత్పత్తి నిలిపివేశారు. 

ఇప్పటికే 592 మిలియన్‌ యూనిట్లు.. 

గతేడాది కంటే 15 రోజుల ముందుగానే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ ఏ డాది అప్పర్‌) జూరాలలో 186, లోయర్‌ జూరాలలో 175.. మొత్తం 361 మిలియన్‌ యూనిట్ల  విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిందిగా లక్ష్యాన్ని విధించారు. కా గా, జూరాలకు ఇంకా వరద కొనసాగుతుండడంతో టార్గెట్‌ను మించి విద్యుదుత్పత్తి చేశారు. ఇప్పటివరకు అప్పర్‌) జూరాలలో 285, లోయర్‌ జూరాలలో  307.. మొత్తం 592 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఈ ఏడాది వరదల ప్రభావం ఇంకా తగ్గకపోవడం, రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో  రికార్డును బ్రేక్‌ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

రికార్డు దిశగా విద్యుదుత్పత్తి..

జూరాల ప్రాజెక్ట్‌లో ఆల్‌ టైం రికార్డు విద్యుదుత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది టార్గెట్‌ 361 మిలియన్‌ యూనిట్లు కాగా, ఇప్పటికే 592 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశాం. వరద కొనసాగుతుండటం, మరిన్ని వర్షాలు కురిసే సూచలనలు ఉండడం శుభసూచకం. ఈ పరిస్థితి కొనసాగితే అత్యధికంగా విద్యుదుత్పత్తి చేయగలం.

- జయరాం, జెన్‌కో ఎస్‌ఈ