సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 00:06:40

నీటిని త్వరగా తోడేయండి

నీటిని త్వరగా తోడేయండి

  • సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
  • తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంపై దృష్టి సారించండి
  • సీఎంవో ఓఎస్డీ స్మితా సబర్వాల్‌
  • ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ పంప్‌హౌస్‌, ఎల్లూరు ‘భగీరథ’ ప్లాంటు పరిశీలన

 ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-1 పంప్‌హౌస్‌లో ఉన్న నీటిని త్వరగా తోడిపోయాలని అధికారులను సీఎంవో ఓఎస్డీ స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని రేగుమాన్‌గడ్డ వద్ద నిర్మించిన ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌లో నీట మునిగిన పంప్‌హౌస్‌ను ఆమె పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి తొలగింపు తర్వాత మోటర్లను బాగు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. సంఘటనపై నివేదిక అందించాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. 

కొల్లాపూర్‌ : ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ పంప్‌హౌస్‌లోకి చేరిన నీటిని త్వరగా తోడేయాలని, మోటర్లను బాగు చేయించడంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలకు తాగునీటి ఇ బ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీఎంవో ఓఎస్డీ, మిషన్‌ భగీరథ ఇన్‌చార్జి స్మితాసబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. కొ ల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలోని రేగుమాన్‌గడ్డ వద్ద ఎంజీకేఎల్‌ఐలో భాగంగా నిర్మించిన మొదటి లిఫ్ట్‌ నీటి ముంపునకు గురైన విష యం విదితమే. కాగా, ఈ పంప్‌హౌస్‌ను బుధవారం స్మితాసబర్వాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు, ఏజెన్సీలతో మాట్లాడారు. సంఘటనను గుర్తించిన వారు, ఆ సమయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, పంపులు నీటిలో మునిగిపోవడానికి గల కారణాలు, సమాచార వ్యవస్థ, ఎత్తిపోతల పథకంలో పంపులు ఏర్పాటు చేసిన సంవత్సరం, సామర్థ్యం, సర్వీస్‌, నిర్వహణ తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన సమయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు, పంప్‌హౌస్‌ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. పంప్‌హౌస్‌లోకి నీరు వచ్చిన వెంటనే పవర్‌ నిలిపివేసి.., ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించినట్లు సిబ్బంది వివరించారు. సంఘటనపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్లు షేక్‌ యాస్మిన్‌బాషా, ఎస్‌.వెంకట్రావులకు సూచించారు. 

పెంటారెడ్డి మాట్లాడుతూ పంప్‌హౌస్‌లోకి వచ్చిన నీటిని తోడివేసేందుకు మోటర్లను ఏర్పా టు చేశామని, ఇప్పటి వరకు 10 మీటర్ల మేర నీటిని తోడి వేశామని, ఇంకా 30 మీటర్ల నీరు ఉందని, దాన్ని కూడా సాధ్యమైనంత త్వరలోనే తోడి వేస్తామన్నారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తు న్న నార్లాపూర్‌ రిజర్వాయర్‌, తాగునీటి కోసం ఎ ల్లూరు రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా అంజనగిరి రిజర్వాయర్‌ ద్వారా సరఫరా చేసేందుకు చేపట్టిన ఇన్‌టేక్‌వెల్‌ నిర్మాణ పనులను స్మితాసబర్వాల్‌ పరిశీలించారు. పీఆర్‌ఎల్‌ఐ, ఎంజీకేఎల్‌ఐ ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నదన్నారు. 

మిషన్‌ భగీరథ వద్ద మొక్కలు నాటిన ఓఎస్డీ

ఎల్లూరు మిషన్‌ భగీరథ ప్రధాన పంప్‌హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో స్మితాసబర్వాల్‌ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఉద్యానవనంలో మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో కూడా ఇ లాంటి ఉద్యానవనం లేదని, ఎంతో ఆహ్లాదకరం గా ఉందని కితాబిచ్చారు. మొక్కల నిర్వహణ త దితర అంశాలను మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ స్థలాల్లో ఇలాంటి ఉద్యానవనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ మనూచౌద రి, శిక్షణ కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌, జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సీఈ చెన్నారెడ్డి, రంగారెడ్డి జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి, ఎంజీకేఎల్‌ఐ ఎస్‌ఈ అంజయ్య, పీఆర్‌ఎల్‌ఐ చీఫ్‌ ఇంజినీర్‌ రమేశ్‌, ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుధాకర్‌సింగ్‌, ఆంజనేయులు, కొల్లాపూర్‌ ఇన్‌చార్జి ఆర్డీవో పాండునాయక్‌, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.