మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 00:06:40

ఘాటెక్కిన ఉల్లి

ఘాటెక్కిన ఉల్లి

  • జడ్చర్లలో కిలో ఉల్లి@రూ.90
  • ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

జడ్చర్ల : ఉల్లి ఘాటెక్కుతున్నది..! కన్నీళ్లు పెట్టిస్తున్నది..! రోజురోజుకూ ధరలు పెరగడంతో ప్రజలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. వారం రోజుల కింద కిలో ఉల్లిగడ్డ రూ.30 నుంచి రూ.40 ఉండగా, ప్రస్తుతం జడ్చర్ల మార్కెట్లో రూ.90 పలుకుతున్నది. ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా, కూరగాయల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం, బిల్లాకల్‌, కర్ణాటక రాష్ట్రంలోని భాగ్యపల్లి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ట్రాన్స్‌పోర్టు చార్జీలు కలుపుకుని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమాట కిలో రూ.30-40, వంకాయలు రూ.50, బీరకాయలు రూ.80, సోరకాయలు రూ.30, మిరపకాయలు రూ.50-60, ఆలుగడ్డ రూ.45-50, చిక్కుడుకాయలు రూ.60, బెండకాయలు రూ.60-80, దొండకాయలు రూ.40-50 పలుకుతున్నది.