గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Oct 21, 2020 , 01:56:31

రెవెన్యూ రిజిస్ట్రేషన్‌కు సిద్ధం కావాలి

రెవెన్యూ రిజిస్ట్రేషన్‌కు సిద్ధం కావాలి

  • ఆర్డీవో అమరేందర్‌

వీపనగండ్ల : ప్రభుత్వ ఆదేశాల మేరకు తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే అవసరమైన సామగ్రిని సమకూర్చుకొని పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో అమరేందర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులు పరిశీలించారు. తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకొని మండల స్థాయి లో మెరుగైన రెవెన్యూ సేవలందించుటకు సిద్ధం కావాలని సూచించారు. నూతనంగా రూపొందించిన రెవెన్యూ నిబంధనలపై సిబ్బందికి వివరించా రు. కార్యక్రమంలో తాసిల్దార్‌ యేషయ్య, ఆర్‌ఐ రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

వనపర్తి రూరల్‌ : నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ తన ఓటును నమోదు చేసుకోవాలని ఆర్డీవో అమరేందర్‌ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 290 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వాటిలో మార్పులు చేసే అవకాశం లేదన్నారు. నవంబర్‌ 6వ తేదీ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు చివరి రోజు  అన్నారు. అంతలోగా ప్రతి పార్టీ విధిగా నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్‌ ఓటు నమోదు చేసుకోనేలా ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ఆయా పార్టీల నాయకులు కృష్ణ, శంకర్‌ప్రసాద్‌, జబ్బార్‌, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.