సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 19, 2020 , 04:20:48

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ఖిల్లాఘణపురం : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనే క సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అం దులో భాగంగా మత్స్యకారుల అభివృద్ధికి చేప పిల్లల పం పిణీ, సబ్సిడీలో యంత్రాల కొనుగోలు తదితర వాటిని ప్రవేశపెడుతూ ఆర్థికంగా అండగా నిలిచాడు. తెలంగాణ లో సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి పూడికతీత పనులను చేపట్టడంతో నేడు ఏ గ్రామంలో చూసిన చెరువులు, కుంటలు నిండుగా కనబడుతున్నా యి. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పంపిణీ చేసి న చేప పిల్లలను చెరువులు, కుంటలలో వదలడంతో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంచుతున్నాయి. అందు లో భాగంగానే మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు ఎంజీకేఎల్‌ఐ నీటితో నిండి అలుగుపారడంతో ఐదు లక్షల చేప పిల్లలను వదిలారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధిని పెంచుతుంది. 

ఆరు టన్నుల చేపలు ఎగుమతి

మండలంలోని గణపసముద్రం చెరువలో గత ఏడాది, ఈ ఏడాది వదిలిన చేప పిల్లలు పెద్దవి కావడంతో శని, ఆదివారం మత్స్యకారులు చేపలను పట్టి హైదరాబాద్‌కు ఎగుమతి చేశారు. పది కేజీల వరకు చేపలను పట్టి మంచి ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాక మండలంలోని ఆ యా గ్రామాల కూడా విక్రయిస్తున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు ఆరు టన్నుల చేప పిల్లలను ఎగుమతి చేశా రు. గణప సముద్రం అలుగుపారితే చేపలు పట్టేందుకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందస్తుగా చేపలను పట్టి విక్రయించారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్‌ మ త్స్యకారుల అభివృద్ధికి అండగా ఉంటున్నాడని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

సీఎం కేసీఆర్‌ మత్స్యకారుల అభివృద్ధికి చేప పిల్లలను పం పిణీ చేయడంతో ఆ చేప పిల్లలను చెరువులో వదిలి సంరక్షించి పెద్దవిగా చేసి విక్రయిస్తూ ఆర్థికంగా ఎదుగుతు న్నాం. చెరువులు, కుంటలు నిండుగా ఉండడంతో చేపల పెంపకం సులువుగా ఉంది. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.  

- సింగోటం, మత్స్యకారుడు, ఖిల్లాఘణపురం